11, మే 2009, సోమవారం

భారత భారతి - సుభాషితములు.

గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః భయంకరైః
విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః

మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,
ఆడంబరముచే కాదు.
పాలను బట్టి ఆవులను కొందురే గానీ,
మెడలోని గంటలను చూచి కొనరు గదా.

8, మే 2009, శుక్రవారం

భారత భారతి - సుభాషితములు.

అపూర్వ కో..పి కో..శోయం విద్యతే తవ భారతీ
వ్యయతో వృద్ది మాయాతి క్షయమాయాతి సంచయాత్.

ఓ సరస్వతీ.. విద్య అనెడి నీ ధనము మిక్కిలి గొప్పది.
ఎట్లనగా ఆ విద్యను వ్యయము చేసిన కొలది వృద్ది చెందును.
దాచుకున్నకొలది క్షీణించును కదా.